రోడ్డు భద్రతపై వాహనదారులకు పోలీసుల అవగాహన!

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం /తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆలైవ్, అరైవ్, పది రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా.. కరకగూడెం పోలీసుల ఆధ్వర్యంలో రహదారి భద్రత ట్రాఫిక్ నియమాలపై బుధవారం భట్టుపల్లి ప్రధాన రహదారిపై వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా కరకగూడెం ఎస్సై  పివిఎన్ రావ్ మాట్లాడారు… ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రమాదాలను ఎలా నివారించాలి, హెల్మెట్ సీట్ బెల్ట్ ప్రాధాన్యత, డ్రంక్ అండ్ డ్రైవ్, వల్ల జరిగే అనర్ధాలు మైనర్లు వాహనాలు నడపడం వల్ల ఎదురయ్యే సమస్యల గురించి వివరించారు.

 

మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడద న్నారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాల న్నారు. ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘిస్తే తమ కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడతారని ఆయన గుర్తు చేశారు. రహదారి భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని ప్రతి వాహనదారుడు దీని సామాజిక బాధ్యతగా స్వీకరించినప్పుడే ప్రమాద రహిత సమాజం సాధ్యమ వుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  వాహనదారులు పాల్గొన్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram