నిరాధారమైన ఆరోపణలు సరైనవి కాదు

 స్థానిక విద్యుత్ శాఖ ఉద్యోగులపై వచ్చిన ఆరోపణలను విచారించిన ఉన్నతాధికారులు..

 

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం  / మండలం ,అనంతారం గ్రామంలో విద్యుత్ శాఖపై కొందరు వ్యక్తులు చేసిన ఆరోపణలు, పత్రికల్లో వచ్చిన కథనాలపై, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన చీఫ్ జనరల్ మేనేజర్ (ఆడిట్) శ్రీ రవీంద్రనాథ్  సమగ్రంగా విచారణ నిర్వహించారు.

ఈ విచారణ సందర్భంగా అధికారులు అనంతారం గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సభ్యులు, ప్రజా ప్రతినిధులన ద్వారా  వివరాలు అడుగు తెలుసుకున్నారు.అన్ని వాఖ్యాలు విద్యుత్ శాఖకు పూర్తిగా అనుకూలంగా ఉన్నట్లు స్పష్టమైంది.

 

గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం ఇరు వర్గాల మధ్య ఏర్పడిన విభేదాల నేపథ్యంలో, కొందరు వ్యక్తులు వ్యక్తిగత కక్షతో విద్యుత్ శాఖ అధికారులపై నిరాధార ఆరోపణలు చేసినట్లు గ్రామ ప్రజలు తెలిపారు. అయితే, విద్యుత్ శాఖ అధికారులు ఎటువంటి రాజకీయ ఒత్తిడులకు లోనుకాకుండా, నిబంధనలకు లోబడి, నిజాయితీతో విధులు నిర్వహిస్తున్నారని గ్రామ ప్రజలు  తెలిపారు.

గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులు తమ స్వస్థలాలకు దూరంగా ఉండి కూడా, హెడ్‌క్వార్టర్స్‌లోనే నివసిస్తూ, ఏ చిన్న విద్యుత్ సమస్య వచ్చినా తక్షణమే స్పందిస్తూ, రాత్రి పగలు తేడా లేకుండా సేవలందిస్తున్నారని గ్రామ ప్రజలు ప్రశంసించారు.

 

ఇతర శాఖలతో పోలిస్తే, విద్యుత్ శాఖ గ్రామ ప్రజలకు అత్యుత్తమమైన, వేగవంతమైన మరియు నమ్మకమైన సేవలు అందిస్తున్న శాఖగా గుర్తింపు పొందిందని ప్రజలు తెలిపారు. అందువల్ల గ్రామ ప్రజలందరూ రాజకీయ భేదాభిప్రాయాలను పక్కనబెట్టి విద్యుత్ శాఖ సేవలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు  అధికారులు తెలిపారు.

గ్రామ సర్పంచ్ శ్రీమతి పాయం కృష్ణవేణి, ఉపసర్పంచ్  పూజారి వెంకన్న, ఆధారాలు లేని ఆరోపణలు, తప్పుడు ప్రచారాలను గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించరాదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, విద్యుత్ శాఖకు మద్దతు ప్రకటించారు.

ఈ విచారణలో DE శ్రీ కె. జీవన్ కుమార్ , ADE శ్రీ ఉమా మహేశ్వరరావు, ఇన్‌చార్జ్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ రాజ శేఖర్, లైన్మెన్ శ్రీ జి. నరసింహారావు పాల్గొని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు విద్యుత్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram