ఈ 2 నెలలు దోమలతో జాగ్రత్త ఫిబ్రవరి, మార్చి నెలల్లో దోమల బెడద మరింత పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. నవంబర్ నుంచి జనవరి వరకు దోమలు గుడ్లు పెట్టగా ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరిగి వాటి సంఖ్య పెరుగుతోందని తెలిపారు. దోమలు తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో అత్యంత చురుగ్గా ఉంటాయని, గాలిలో తేమ వల్ల కుడతాయని చెప్పారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడటం, కిటికీలు మూయడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Post Views: 93









