వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

 

– టీబీ,ముక్తభారత్ అభియాన్ కార్యక్రమాన్ని సద్వియోగం చేసుకోవాలి

 – వైద్యాధికారి డా,పి రవితేజ

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం /సమాజంలో సంబంధంలేని రోగాలు వస్తున్న సందర్భంగా ప్రజలు రోగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కరకగూడెం వైద్య అధికారి పి రవితేజ అన్నారు.

సోమవారం సమత్ మోతె పంచాయితి గొల్లగూడెం పాఠశాల నందు టీబీ,ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పి. రవితేజ మాట్లాడుతూ… రోగాల పట్ల ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దని అన్నారు. ప్రస్తుతం రోజుల్లో అంతుపట్టని రోగాలు కూడా వస్తున్నాయని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.ముఖ్యంగా టీబీ రోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని మంచి వైద్యం చేయించుకోని,ఆరోగ్యంగా ఉండాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్లబోయిన ముత్తమ్మ,హెల్త్ సూపర్వైజర్ పోలెపోయిన కృష్ణయ్య,టెక్నికల్ అసిస్టెంట్ సాయి కృష్ణ,టీబీ సూపర్వైజర్లు ప్రేమ్ కుమార్,సాయి కుమార్,ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram