కాటేసిన పాముతో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి.

 గోల్డెన్ న్యూస్ / ఆంధ్రప్రదేశ్ /పాము (Snake) కాటుకు గురైన ఓ వ్యక్తి.. ఏకంగా ఆ పామును తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పొట్టి శ్రీరాములు జిల్లాలో చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో నెల్లూరు శివారు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు సోమవారం మధ్యాహ్నం హోటల్ భోజనం చేస్తుండగా అత్యంత విషపూరితమైన రక్తపింజరి కాటు వేసింది. అప్రమత్తమైన యువకుడు వెంటనే దానిని చంపేసి, ఆ పాముతో సహా కోవూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. అతడిని చూసిన వైద్యులు, స్థానికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.వ్యక్తికి వైద్యం అందిస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram