శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని సీతారాంపురం కాలనీలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్,సర్పంచులు : తోలెం రమాదేవి, కొమరం సుగుణ , చౌలం కేశవరావు , పోలేబోయిన సుజాత , ఎర్రం పొట్టయ్య , తోలెం రమేష్ ,ఉప సర్పంచులు గాందర్ల రామనాథం , ఇర్రి వెంకన్న ఆలయ కమిటీ సభ్యులు, మాజీ సర్పంచులు పోలేబోయిన శ్రీవాణి తిరుపతయ్య, తోలెం నాగేశ్వరరావు, మండల నాయకులు ఎర్ర సురేష్, గొగ్గలి రవి, భూక్య రాందాస్, షేక్ రఫీ, కొమరం వెంకటేశ్వర్లు, దెంచనల రాజేంద్ర ప్రసాద్, దుర్గం కన్నయ్య, కరకపల్లి నాగేష్, తదితరులు పాల్గొన్నారు.









