కరకగూడెం పీహెచ్సీలో 100 రోజుల హెల్త్ మిషన్ కార్యక్రమం

 తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో వంద రోజుల ఆరోగ్య కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు డాక్టర్ రవితేజ సోమవారం వెల్లడించారు.

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం /తెలంగాణ రైసింగ్ నెంబర్ వన్ భాగంగా మిషన్ హెల్త్ 100 డేస్ స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్ ఈనెల 11వ తేదీ నుండి ఉదయం 9:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు మన పి హెచ్ సి కరకగూడెం నందు నిర్వహించనున్నట్లు వైద్యాధికారి డాక్టర్ రవితేజ తెలిపారు. ఇందులో  ప్రత్యేక క్యాంపుల ద్వారా గైనకాలజిస్ట్లతో అనీమియా స్క్రీనింగ్, హైరిస్క్ గర్భిణీల గుర్తింపు, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ పరీక్షలతో పాటు చిన్న పిల్లలకు పూర్తిస్థాయి టీకాలు, విటమిన్- -ఏ పంపిణీ చేపడతామన్నారు. అలాగే యువతలో పరీక్షల ఒత్తిడి నివారణకు కౌన్సిలింగ్, వృద్ధులకు బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల కోసం ప్రత్యేక జేరియాట్రిక్ క్యాంపులు నిర్వహిస్తామని వివరించారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు..

 

 

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram