వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు
గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం/మాహత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనిని ఉపాధి కార్మికులకి అందకుండా దొరకకుండా అంబానీకి ఆదానీల కు దగ్గరకు చేరువయ్యే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు ఉపాధి పనిని సందర్శిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు
కోయగూడెం పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న ఉపాధి కార్మికుల ని సందర్శించారు రెండు ఫోటోలు పేరుతో మధ్యాహ్నం రెండింటి దాకా ఉంచుతున్నార ని యాప్ డౌన్లోడ్ కావడం లేదని నెట్టు అందుకోవటం లేదని అనేకమైన ఇబ్బందులకు గురవుతున్న ఉపాధి కార్మికులు ఎర్రటి ఎండలో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు
పాత పద్ధతిలోని ఉపాధి పని ఉంచాలని విబి జి రామోజీ పేరుతో తెచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని అదేవిధంగా 600 రూపాయలు రోజు కూలి ఇవ్వాలని అన్నారు పని దొరక్క చేసిన పనికి డబ్బులు రాక అనేక ఇబ్బందులతో ప్రజలు తల్లడిలుతున్నారు కానీ యుద్ధం పేరుతో గ్యాస్ 62 రూపాలు పెంచారని ఇది సామాన్యుడు కొనుక్కోలేని పరిస్థితి అంతే కాకుండా
గ్యాస్ ధర పెరిగిందని హోటల్ మొత్తం మూతపడుతున్నాయని కట్టెలు కూడా దొరకటం లేదని ఈపరిస్థితి మోడీ నిర్వాకంవల్లే జరిగిందని తెలిపారు
అమెరికాకు లొంగు పోయి దాసోహం అంటూ భారతీయుల ప్రయోజనాలను వారికి ప్రాణంగా పెట్టారని అన్నారు
ఆదివాసీలను అడవుల నుంచి వెళ్ళగొట్టి మొత్తం భూభాగాన్ని దోపిడీకి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారని గిరిజనలు అంబానీలతో అధానిలతో పోరాడాల్సి వస్తుందని వివరించారు
అడవుల్లోనే కొండలు నీళ్లు గనులు ఇనుము అల్యూమినియం యురేనియం బొగ్గు వాటన్నిటిని స్వాధీనం చేసుకుంటున్నారని దీనికి గిరిజనులు అడ్డంగా ఉన్నారని మావోయిస్టులు వారికి అండగా ఉన్నారనే కారణంతో ఆపరేషన్ కగార్ పేరుతో వారిని చంపేస్తున్నారని తెలిపారు
ఈ కార్యక్రమంలో మడకం రామయ్య బంగారమ్మ తిరుపతమ్మ రమణ రాజేశ్వరి కుంజా లక్ష్మి సావిత్రి తదితరులు పాల్గొన్నారు









