⇒ అనంతారంలో మెగా వైద్య శిబిరం విజయవంతం
⇒సేవా స్పూర్తితో వైద్యుల ముందడుగు
⇒మెడికల్ అసోసియేషన్ సేవా స్ఫూర్తి అబినందనీయం
గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / మండల పరిధిలోని అనంతారం జెడ్పి పాఠశాల ఆవరణలో ఆదివారం మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతం అయ్యింది.ఈ శిబిరంలో మణుగూరు పట్టణానికి చెందిన వివిధ విభాగాల ప్రముఖ వైద్యులు మధుసూదన్ రావు,బుడగం రామకృష్ణ, భవానీ, వీర శేఖర్, ఉమా శంకర్, మోహన్ వంశీ యాదవ్ తో పాటు ప్రభుత్వ నేత్ర వైద్యులు సంజీవరావు పాల్గొని రోగులను పరీక్షించారు.శిబిరానికి హాజరైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేయడంతో పాటు,అనేక మంది ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు.నిర్వాహకులు సుమారు 240 మందికి విలువైన మందులను ఉచితంగా అందజేశారు.అలాగే మరో 160 మందికి మధుమేహం, రక్తపోటు (బీపీ) పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను కూడా అందించారు.ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్యంపై మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.చిన్న చిన్న అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే చికిత్స పొందితే తీవ్రమైన వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించేందుకు కృషి చేయాలనీ,మెడికల్ అసోసియేషన్ సేవా స్ఫూర్తి అబినందనీయంమని వారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పాయం కృష్ణవేణి,మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వరరావు,సభ్యులు రాధా శ్యామ్ గుప్తా, సురేష్, సత్యనారాయణ,జగదీష్,శ్రీనివాస్,ఎల్లారెడ్డి,షేక్ సోందుపాషా, ప్రసాద్, మస్తాన్, రామలింగం, రాజు, దినేష్, ప్రవీణ్,తదితరులు పాల్గొన్నారు.










