జహీరాబాద్ లో ఘోరం… ప్రియుడి ముందే భార్య గొంతు కోసిన భర్త

 

సోషల్ మీడియా పరిచయాలు, క్షీణికవేశాలుపచ్చని సంసారాలను ఎలా కూల్చివేస్తాయో నిరూపించే మరో విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పదేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో ఏర్పడిన పరిచయం, ఒక ఇల్లాలిని భర్త, పిల్లలకు దూరం చేయడమే కాకుండా, చివరకు ఆమె ప్రాణాలను బలిగొంది. జడ్చర్ల నుంచి జహీరాబాద్‌కు కారులో వస్తున్న సమయంలో, పోలీసు కానిస్టేబుల్ సమక్షంలోనే భర్త తన భార్య గొంతు కోసి హత్య చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

జహీరాబాద్ పట్టణ సీఐ, ఎస్సైలు శివలింగం, వినయ్కుమార్ తెలిపిన ప్రకారం… ఝరాసంగం మండలం తుమ్మన్పల్లికి చెందిన సిద్ధారెడ్డి(35), కవిత(29) భార్యాభర్తలు. జహీరాబాద్లో అద్దెకుంటూ సిద్ధారెడ్డి పానీపూరి బండి నడుపుతుండగా కవిత టైలర్గా పనిచేస్తోంది. ఆమెకు చిత్తూరు జిల్లా తిరుపతి మండలం చంద్రగిరికి చెందిన పవన్కుమారెడ్డి(32)తో పదేళ్ల కిందట ఫేస్ బుక్ పరిచయమై, సాన్నిహిత్యం ఏర్పడింది. మార్చి 27న అర్ధరాత్రి ఆమె భర్త, తొమ్మిదేళ్ల కూతురు, ఆరేళ్ల కుమారుడిని వదిలేసి జడ్చర్లలో ఉంటున్న పవన్ రెడ్డి వద్దకు వెళ్లిపోయింది. భార్య కనిపించడం లేదని సిద్ధారెడ్డి 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో కవిత జడ్చర్లలో ఉన్నట్లు తెలిసింది.

ఆదివారం ఆమెను జహీరాబాద్ తీసుకొచ్చేందుకు కానిస్టేబుల్ ఖదీర్, భర్త సిద్ధారెడ్డి కారులో వెళ్లారు.కవిత, ఆమె ప్రియుడు పవన్కుమార్రెడ్డికి జడ్చర్లలో పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి భర్త వెంట వెళ్లాలని సూచించారు. అందుకు నిరాకరించిన కవిత భర్తను దూషించింది. ఆమెపై అప్పటికే కోపంతో  సిద్ధారెడ్డి చాయ్  కోసమని వెళ్లి చాకు కొన్నాడు. ఆమె తన భర్తతో ఇంటికి వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో కారులో ప్రియుడు పవన్ రెడ్డి తో కలిసి జహీరాబాద్ కు బయలుదేరారు. సిద్ధారెడ్డి, పవన్ రెడ్డి కలిసి వెనక సీటులో కూర్చుంది. కాసేపట్లో  జహీరాబాద్ చేరుకుంటామనేలోగా సిద్ధారెడ్డి జేబులోంచి చాకు తీసి కవిత గొంతు, మెడపై పొడిచాడు. వెంటనే కానిస్టేబుల్ అప్రమత్తమై కారును సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడికి చేరేలోపే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పంచనామా అనంతరం సోమవారం కవిత మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram