మొబైల్ ఫోన్ నుండి భారీ శబ్దం వస్తే భయ పడాల్సిన పనిలేదు !

 నేడు ఫోన్లలో ఎమర్జెన్సీ సైరన్

మొబైల్ ఫోన్ నుండి భారీ శబ్దం వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు.

అది ఎటువంటి ప్రమాద హెచ్చరిక కాదు. 

శనివారం మీ మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మోగుతూ స్క్రీన్ పై జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) నుండి ఏదైనా సందేశం కనిపిస్తే అసలు కంగారు పడకండి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక కీలకమైన “టెస్ట్ అలర్ట్ ” మాత్రమే.( సునామీలు, భూకంపాలు, పిడుగుపాటు లేదా గ్యాస్ లీకేజీల వంటి అత్యవసర సమయాల్లో లక్షలాదిమంది ప్రజలకు క్షణాల్లో సమాచారాన్ని చేరవేయడం ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిర్యాదిత్య కలిసి ఈ మొబైల్ ఆధారిత వివత్తు కమ్యూనికేషన్ ను నేడు ప్రారంభించనున్నారు.(సరిహద్దు ప్రాంతాల్లో మినహాయింపు)

Facebook
WhatsApp
Twitter
Telegram