మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన‌

 గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అసాధారణంగా మారుతోంది. ఉద‌యం ఎండల దెబ్బతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా, సాయంత్రానికి పిడుగులు, ఈదురు గాలులతో వర్షాలు కురుస్తున్నాయి.ఆదివారం సాయంత్రం కొరకగూడెం మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. వారం రోజులుగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. గాలిదుమ్ముతో కూడిన వర్షం పడటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ గాలివానకు పలుచోట్ల చెట్లు విరిగిపడటంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది.

Facebook
WhatsApp
Twitter
Telegram