గోల్డెన్ న్యూస్/ వెబ్ డెస్క్/ తెలంగాణ లో ఎండ వేడిమితో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాగల 2 రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, MBBD జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడవచ్చని పేర్కొంది. మే 5న (ఎల్లుండి) జయశంకర్, ములుగు, WGL, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Post Views: 347








