ఐకేపీ కేంద్రం వద్ద విషాదం… పిడుగుపాటుకు రైతు మృతి

 

గోల్డెన్ న్యూస్ /మహబూబాబాద్ / మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లి గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పంటను కాపాడేందుకు కేంద్రం వద్దే ఉన్న రైతు వెంకన్న (45)పై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

 

స్థానిక సమాచారం మేరకు, ప్రభుత్వం వడ్ల కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దే నిల్వ చేసుకుని కాపలా కాస్తున్నారు. ఈ క్రమంలో వెంకన్న కూడా తన పంటను రక్షించేందుకు ఐకేపీ సెంటర్ వద్దే ఉండిపోయాడు. ఈ సమయంలో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షం, ఉరుములు-మెరుపులతో కూడిన వాతావరణంలో పిడుగు పడటంతో అతను ప్రాణాలు కోల్పోయాడు.

 

మృతుడు వెంకన్న మూగ, చెవిటి దివ్యాంగ రైతు కావడం ఈ ఘటనకు మరింత విషాదాన్ని జోడించింది. కుటుంబానికి అండగా నిలవాల్సిన వ్యక్తి ఇలా అకస్మాత్తుగా మృతి చెందడంతో గ్రామంలో దుఃఖ వాతావరణం నెలకొంది.

 

ఈ ఘటనపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సమయానికి వడ్ల కొనుగోలు చేసి ఉంటే వెంకన్న ఈ ప్రమాదానికి గురయ్యే వాడు కాదని వారు ఆరోపిస్తున్నారు. వెంటనే మృతుడి కుటుంబానికి తగిన పరిహారం ప్రకటించి, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram