ఆరుగాలం కష్టం.. అంతిమంగా ఆగం!

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం  / ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం ఆదివారం కురిసిన అకాల వర్షానికి తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల్లో తగిన రక్షణ చర్యలు లేకపోవడంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట తడవడంతో నాణ్యత కోల్పోతుందని రైతన్నలు ఆవేదన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు ఆలం పండించిన పంట చేతికొచ్చే సమయానికి  కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రభుత్వం స్పందించి, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram