తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు.

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ / తెలంగాణ జిల్లాల్లో ఎండలు ప్రజలను హడలిప్పిస్తున్నాయి. క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్క డిగ్రీ తగ్గాయి. రాగల రెండు మూడు రోజుల్లో ఎండ తీవ్రత గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 8వ తేదీ నుంచి మళ్లీ క్రమంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు తెలిపారు. పలు జిల్లాల్లో ఇవాళ, రేపు, ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వారు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram