పొత్కపల్లి పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

ఇంటి  అనుమతికి లంచం తీసుకున్న పంచాయతీ కార్యదర్శి

 

గోల్డెన్ న్యూస్/ ఓదెల/  పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి కుమారస్వామి ఓ వ్యక్తి నుండి ఇంటి నిర్మాణ అనుమతి మంజూరు చేయడానికి ఫోన్పే ద్వారా రూ.5 వేల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ ఘటనపై బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. అనంతరం పొత్కపల్లి గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకుని పంచాయతీ కార్యదర్శిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. కార్యాలయంలోని రికార్డులు, అనుమతులకు సంబంధించిన పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.ఫోన్పే లావాదేవీల

వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. లంచం తీసుకున్న వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు

 

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram