డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పోలీసులపై కత్తితో దాడికి వ్య‌క్తి యత్నం

గోల్డెన్ న్యూస్ /మణుగూరు / డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల సందర్భంగా పోలీసులపై కత్తితో దాడికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం బుధవారం సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో మణుగూరు తోగ్గుడెం సమ్మక్క-సారక్క టెంపుల్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో తోగ్గూడెం నుంచి మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై వస్తున్న సోలేం నాగేశ్వరరావును ఆపి డ్రంకెన్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా అతనికి 80 బీఏసీ శాతం నమోదైనట్లు తెలిపారు. పరీక్ష అనంతరం అతడిని ఇంటికి పంపించగా, కొద్దిసేపటి తర్వాత ఇంటికి వెళ్లి కత్తి తీసుకుని తిరిగి ఘటన స్థలానికి వచ్చాడు. నాకే డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేస్తారా అంటూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ వారిపై కత్తితో దాడికి యత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో 07.05.2026న సోలేం నాగేశ్వరరావును అరెస్టు చేసి జ్యూడిషియల్ రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులపై ఈ తరహా ఘటన మణుగూరు మండలంలో జరగడం ఇదే తొలిసారి అని స్థానికంగా చర్చ జరుగుతోంది.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram