గోల్డెన్ న్యూస్/ బోధన్ / చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు ప్రతి వాహనాన్ని అనుమానాస్పద కోణంలో పరిశీలిస్తూ అవసరమైతే సాంకేతిక పరికరాల సహాయంతో తనిఖీలు చేపట్టాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సాలూర గ్రామ సరిహద్దు లోని చెక్ పోస్ట్ ను గురువారం సీపీ ఆకస్మికంగా సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న తనిఖీలను పరిశీలించారు. బక్రీద్ పండుగలో మూగ జీవాలు, వరి ధాన్యం ట్రాన్స్ పోర్టు నేపథ్యంలో పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు ముఖ్య సూచనలు చేశారు.
Post Views: 28








