గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ / ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతను జూన్ 2న ఆదిలాబాద్‌లో ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
పేదలకు ఉపాధి ఇబ్బందులు తలెత్తకుండా….
వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుండి 8 కి.మీ పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
హైదరాబాద్ పరిధిలో స్థలాలు ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, ప్రభుత్వ భూముల ఆక్రమణను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మంత్రి హెచ్చరించారు.
Post Views: 551








