వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు…
గోల్డెన్ న్యూస్/ వరంగల్ / రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఆర్‌ఐ రాంబాబు ను పట్టుకున్న అధికారులు.వరంగల్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన మెరుపు దాడిలో ఒక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న గట్టికొప్పుల రాంబాబు, ఒక వ్యక్తి నుండి ₹10,000 లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు. బాధితుడికి సంబంధించిన వారసత్వ ఆస్తి మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి, క్షేత్రస్థాయి విచారణ జరిపి తహసీల్దార్‌కు నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈ పని చేయడానికి రాంబాబు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు.
Post Views: 576








