బానుడి భగ భగ : వారం రోజులు జాగ్రత్త

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్‌ / వచ్చే వారం రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తించనున్నాయి. ఈ నెల 19- 24వ తేదీ మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. సగటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే ప్రమాదం ఉందని, వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇవాళ తెలంగాణలో ఆదిలాబాద్‌, కుమురం భీం, నిర్మల్‌, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు అధికారులు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఇవాళ 16 జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో 41-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. సోమవారం ఏడు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram