డీజే సౌండ్ చాలా ప్రమాదకరం

డీజే సౌండ్ చాలా ప్రమాదకరం..

వైద్య పరీక్షల్లో షాకింగ్ నిజాలు

 

ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ఇటీవలే డీజే విపరీతమైన శబ్దం కారణంగా ఒక యువకుడు తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితికి చేరుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది..

 

తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలోని ఎస్సీ కాలనీ లో

బంధువుల ఇంట్లో జరిగిన ఒక పెళ్లి వేడుకకు సదరు యువకుడు హాజరయ్యాడు..వివాహ ఊరేగింపులో భాగంగా అక్కడ భారీ శబ్దాలతో కూడిన డీజే సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.

 

డీజే నుండి వస్తున్న హై-డెసిబెల్ శబ్దాల హోరుకు మిగతా యువకులతో కలిసి ఆ యువకుడు కూడా ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ వేశాడు..అయితే డీజే స్పీకర్ల నుండి వచ్చిన విపరీతమైన సౌండ్ బేస్ కు యువకుడి శరీరం తట్టుకోలేకపోయింది..డ్యాన్స్ చేస్తూనే ఒక్కసారిగా తల పట్టుకుని అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లి కుప్పకూలిపోయాడు..

 

తీవ్ర అస్వస్థతకు గురైన యువకుడిని కుటుంబ సభ్యులు వెంటనే అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు (EEG మరియు స్కానింగ్) నిర్వహించగా, డీజే విపరీతమైన శబ్దాల ఒత్తిడి కారణంగా మెదడులోని రక్తనాళాలు చిట్లి, రక్తం గడ్డకట్టినట్లు నిర్ధారణ అయింది..

 

యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు..

 

ఇలాంటి సంఘటనలు డీజే శబ్దాల వల్ల కలిగే ప్రాణాంతక నష్టాలను మరోసారి హెచ్చరిస్తున్నాయి. వివాహాలు, పండుగల ఊరేగింపుల్లో విపరీతమైన శబ్దాలు చేసే డీజేలకు యువత, చిన్నపిల్లలు, గుండె జబ్బులు ఉన్నవారు వీలైనంత దూరంగా ఉండటం మంచిదంటున్నారు వైద్యులు..

Facebook
WhatsApp
Twitter
Telegram