గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / అతివేగం ఓ ప్రాణం తీసింది. ఆగి ఉన్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని వీరాపురం గ్రామానికి చెందిన పోలెబోయిన రాంబాబు(40) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం స్వగ్రామం వీరాపురం నుండి ఆటో నడుపుతూ అతడు కరకగూడెం వైపు వస్తుండగా భట్టుపల్లి గ్రామం వద్ద ఆగి ఉన్న ద్విచక్రవాహనాన్ని ప్రమాదవశాత్తు ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో రాంబాబుకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే మణుగూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందుతూ.. రాంబాబు మృతి చెందాడు. మృతుడు బావమరిది వజ్జా రామనాథం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పీవీ నాగేశ్వరరావు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు
Post Views: 78








