ఇండియన్ ఆర్మీలో ఎంపికైన మండల యువకుడు

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన ఎం.డి. ఇమ్రాన్ భారత ఆర్మీలో ఎంపికై గ్రామానికి, మండలానికి గర్వకారణంగా నిలిచారు. రఫిక్ పాషా కుమారుడైన ఇమ్రాన్ తన కృషి, క్రమశిక్షణ, పట్టుదలతో ఈ ఘనత సాధించారు.

 

ఇమ్రాన్ ఇండియన్ ఆర్మీలో చేరడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. దేశ సేవ అనే మహోన్నత బాధ్యతను స్వీకరిస్తూ భారత ఆర్మీలో అడుగుపెడుతున్న ఇమ్రాన్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

 

ఈ సందర్భంగా రఘునాథపాలెం గ్రామ పంచాయతీ ప్రజలు, యువకులు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఆయన విజయం గ్రామ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram