ఇద్దరు యువకులు మృతి
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం నందిగామ బైపాస్ రోడ్డులోని గాయత్రి మిల్క్ ప్లాంట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టాటా నెక్సాన్ కారు, హీరో స్ప్లెండర్ మోటార్ సైకిల్‌ను ఢీ కొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను రోషన్ కుమార్ (24), కొత్తూర్ పట్టణ నివాసి, బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా, అలాగే పంకజ్ (19), నందిగామ పట్టణంలో నివాసం ఉంటున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇద్దరూ నందిగామ పట్టణంలోని ఎస్‌ఎన్ పాలీ ప్యాక్ కంపెనీలో కార్మికులుగా పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ ఘటన స్థలం నుంచి పరారైనట్లు తెలిసింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సీహెచ్‌సీ షాద్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు..








