గోల్డెన్ న్యూస్/వరంగల్ / గతంలో హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహించి ప్రస్తుతం వరంగల్ సీసీఎస్లో పని చేస్తున్న ఎస్సై రాజ్ కుమార్ హనుమకొండ పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది.
హనుమకొండ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… 2022లో రాజ్ కుమార్ హనుమకొండ స్టేషన్లో పని చేసిన సమయంలో ఓ మహిళ భర్తపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్కు రాగా. అప్పటికే ఆమెకు పాప ఉంది. దీనిని ఆసరాగా చేసుకొని రాజ్ కుమార్ ఆమెతో స్నేహంగా ఉంటూ న్యాయం చేస్తానని నమ్మించి బాధిత మహిళకు భర్తతో విడాకులు ఇప్పించాడు.
తర్వాత ఎస్సై ఆమెను పలుమార్లు లైంగికంగా వేధించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి రెండుసార్లు గర్భస్రావం చేయించాడు. బాధి మహిళ పెళ్లి చేసుకోవాలని ఆయన్ని కోరగాఒప్పుకోలేదు. దీంతో ఆమెను బెదిరిస్తూ నగ్న చిత్రాలున్నాయి, నేను చెప్పినట్లు వినాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇటీవల ఆమెను బలవంతంగా నగరంలోని ఓ హోటల్కు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. తరచూ వేధిస్తుండటంతో విసుగు చెందిన బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లైంగిక దాడి, మోసం, బెదిరింపులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు








