మృతురాలి చితాభస్వంలో కత్తెర!

వైద్యుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని కుటుంబ సభ్యుల ఆరోపణ.

మృతురాలి చితాభస్వంలో కత్తెర ఎలా వచ్చింది ?

 

గోల్డెన్ న్యూస్ /గుండాల /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభునిగూడెం గ్రామంలో స్మశానంలో దహనం చేసిన ఒ మృతురాలి చితా బస్వంలో కత్తెర లభ్యమైన ఘటన గురు వారం వెలుగుచూసింది..

వివరాల్లోకి వెళితే… గుండాల మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన చాట్ల వనజకు ఆదివారం తెల్లవారుజాము  పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యుడు తూరుబాక గ్రామంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరంలో విధులు నిర్వహిస్తున్నారు. కానీ గర్భిణి వనజకు నొప్పుల తీవ్రత ఎక్కువ కావడంతో ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న  ఓ నర్సు ప్రసవం చేసింది. ఆమెకు జన్మించిన ఆడ శిశువు శరీరంలో కదిలికలు లేకపోడంతో కుటుంబ సభ్యులకు పరిస్థితిని వివరిం చింది. దీంతో వనజను, ఆమెకు జన్మించిన శిశువును ఇల్లెందు ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించగా.. వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి తరలించారు. శిశువును పరీక్షించి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తల్లికి తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో ప్రాథమిక చికిత్స చేసి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. మృతురాలు వనజకు ఏ ఆసుపత్రిలోనూ ఆపరేషన్ చేయ నప్పటికీ కాష్టంలో ఆ కత్తెర ఎలా ప్రత్యక్షమైంది? రక్తస్రావం కాకుండా ఉండేందుకు పెట్టిన కాటన్ లో కత్తెర ఏమైనా ఉందా? లేదా.. కడుపులో పొర(మాయ) తొలగించే క్రమంలో  కత్తెర అమర్చి  మర్చిపోయారా? అనే అనే విషయం అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. కుటుంబ సభ్యులు మాత్రం వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగి ఉంటుందని ఆరోపిస్తున్నారు. – తమకు న్యాయం చేయాలని, దీనిపై పూర్తిస్థాయి  విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram