నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు : సీఐ

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం/ నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఏడూళ్ళ బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు విత్తన డీలర్లను హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని పలు విత్తన విక్రయ దుకాణాలను ఆయన తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దుకాణాల్లో విక్రయిస్తున్న విత్తన ప్యాకెట్ల లాట్ నంబర్లు, తయారుచేసిన కంపెనీ వివరాలు  పరిశీలించారు. విక్రయించే ధరలు కూడా దుకాణాల్లో ఏర్పాటు చేసే సూచికపై ఉండాలని ఆదేశించారు. సిఐ వెంట స్థానిక ఎస్సై పివీ నాగేశ్వరరావు. ఉన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram