అనుమానం పెద్ద పెనుభూతం
గోల్డెన్ న్యూస్ / తెలంగాణ /నిజామాబాద్ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది.రెండు నెలల పసికందుని ఓ తండ్రి కిరాతకంగా చంపాడు.అశోక్ నగర్‌కు చెందిన యువరాజ్, ప్రియాంకలకు ఏడాది క్రితం పెళ్లయింది.వీరికి 2 నెలల క్రితమే ‘ప్రేమ్’ అనే బాబు పుట్టాడు.అయితే కొడుకు తనకు పుట్టలేదనే అనుమానంతో తండ్రి యువరాజ్ రెండు రోజుల క్రితం ఆ పసిగుడ్డును ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లి కత్తితో పొడిచి చంపాడు.అనంతరం మృతదేహాన్ని రైల్వే ట్రాక్ పక్కన పారేశాడు.కొడుకు కనిపించకపోవడంతో తల్లి ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది.
Post Views: 18







