మణుగూరు ఆర్టీసీ డిఎం శ్యాంసుందర్ ప్రకటన .
గోల్డెన్ న్యూస్ /మణుగూరు /ఆదివారం నీట్ యూజీ రీఎగ్జామినేషన్ కు హాజరయ్యే అభ్యర్థులకు నాన్ ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు మణుగూరు ఆర్టీసీ డిఎం శ్యాంసుందర్ తెలిపారు . ప్రభుత్వ ఆదేశానుసారం, ఆర్టీసీ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఆదివారం పరీక్ష జరగనుండగా హాల్ టికెట్ చూపించి విద్యార్థులుఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. దూరప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు ఏ బస్సుల్లో అయినా రేపు మొత్తం ఉచితంగా ప్రయాణించవచ్చు అని తెలిపారు. ఈ అవకాశాన్ని నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పత్రికా ముఖంగా కోరారు….
Post Views: 21







