ప్రియుడి మరణం తట్టుకోలేక.. నెల రోజులకే ప్రియురాలు ఆత్మహత్య.

గోల్డెన్ న్యూస్ /మంచిర్యాల / లక్షెట్టిపేట మండలం చందారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. డిగ్రీ పూర్తి చేసిన తుమ్మ అర్చన (21) ప్రేమికుడి మృతిని తట్టుకోలేక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆరేళ్లుగా ప్రేమించుకున్న యువకుడితో వివాహానికి ఇరు కుటుంబాలు తొలుత అంగీకరించినప్పటికీ, అనంతరం విభేదాలు తలెత్తాయి. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు గత నెల పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి తీవ్ర మానసిక వేదనలో ఉన్న అర్చన శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram