ఆగస్టు నుంచి అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ అమలు : మంత్రి సీతక్క

గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్/  వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని అంగన్‌వాడీల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను అమలు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టగా మంచి ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గుడ్లు, పాలు, ఇతర సరకుల సరఫరాలో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram