భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాతా శిశు కేంద్రంలో అమానవీయ ఘటన

గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ /భద్రాద్రి కొత్తగూడెంలోని ఎంసీహెచ్ లో. నిండు గర్భిణి చేరిన బాత్రూమ్ కు వెళ్లే క్రమంలో ప్రసవించింది. దీంతో బిడ్డ జారి క్రింద పడది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళన చేపట్టారు.

జిల్లాలోని దమ్మపేటకు చెందిన గర్భిణికి నెలలు నిండడంతో బుధవారం  జిల్లా కేంద్రం లోని ఎంసీహెచ్ చేర్పించారు. ఈ ఈ క్రమంలోనే ఆమెకు బెడ్ కేటాయించిన వైద్యులు… నొప్పులు వస్తే తమకు తెలిజేయాలని సూచించారు.కాసేపటికి ఆమె బాత్ రూమ్ కు  వెళ్దామని నిలబడగా ఆమె కిందకు జారి పడింది. ఈ క్రమంలో బాలింతకు నొప్పులు రాకుండానే బిడ్డకు జన్మనివ్వడంతో తర్వాత బ్లీడింగ్ అవుతుండడంతో ఆమె బంధువులు వైద్యులు,సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు విచారణ చేయగా సదరు గర్భిణి బెడ్ దిగుతుండగా నొప్పులు తెలియకుండానే డెలివరీ అయిందని.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా, స్థానికులు, కుటుంబ సభ్యులు మాత్రం వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కొంతసేపు ఆందోళన వ్యక్తం చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram