మంచాన్ని జడ్డిగా కట్టి నిరసన వ్యక్తం చేసిన గిరిజనులు
గోల్డెన్ న్యూస్ /పినపాక / రహదారి సౌకర్యం కల్పించాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీ సుందరయ్యనగర్ వలస గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు గర్భిణిని మంచానికి కట్టి నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. వర్షాకాలంలో అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ కూడా గ్రామానికి రాని పరిస్థితి ఉందని వాపోయారు. గతంలో రహదారి మంజూరైందని చెప్పినా పనులు ఎందుకు ప్రారంభం కాలేదో అర్థం కావడం లేదన్నారు. రహదారి సమస్యపై ఐటీడీఏ పీఓ, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని గిరిజనులు కోరారు.
Post Views: 12









