దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజధాని దిల్లీలో ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఎగురవేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఈ వేడుకల్లో ఆలపించారు. జెండా ఎగురవేయడానికి ముందు ప్రధాని మోదీ.. మహాత్ముడికి నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రకోట వద్ద గౌరవవందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
Post Views: 12









