ఎంబీబీఎస్ ప్రవేశాలకు మరో అవకాశం.. ఆగస్టు 20 వరకు రిజిస్ట్రేషన్ –

గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ / తెలంగాణలో 2026–-27 విద్యాసంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా ప్రవేశాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్ యూహెచ్ఎస్) పునఃప్రారంభించింది. నీట్ యూజీ అర్హత సాధించి ఇంతకుముందు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఆగస్టు 18 మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈనెల 20 సాయంత్రం 6 గంటల్లోపు https://tsmedadm.tsche.in  సైట్ ద్వారా దరఖాస్తు లేదా సర్టిఫికెట్లు అప్లోడ్ చేయవచ్చు. ఆగస్టు 12తో దరఖాస్తు గడువు ముగియడంతో విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.కాగా, పాత గడువులో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మరోసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని వర్సిటీ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఆగస్టు 4న విడుదల చేసిన నోటిఫికేషన్, ప్రాస్పెక్టస్ ను పరిశీలించాలని సూచించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram