కళ్యాణలక్ష్మి,షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలి.

పెండింగ్ లో ఉన్న కళ్యాణ లక్ష్మి,షాదీముబారక్ చెక్కులు అందజేయాలని తహసీల్దార్ కి వినతిపత్రం అందజేత. 

 

గోల్డెన్ న్యూస్ /అశ్వాపురం / కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలలను యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ గద్దల రామకృష్ణ అన్నారు.

పెండింగ్ లో ఉన్న కళ్యాణ లక్ష్మి,షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయాలని బుధవారం ఆశ్వాపురం తాహసీల్దార్  వినతి పత్రం అందజేశారు.

అనంతరం యూత్ ప్రెసిడెంట్ గద్దల రామకృష్ణ  మాట్లాడుతూ…మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా కళ్యాణలక్ష్మి,షాదీముబారక్ పథకాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు.వాటి ద్వారా కేసీఆర్కు మంచి పేరు వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాలను తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.పెండింగ్ లో ఉన్న చెక్కులను కూడా లబ్ధిదారులకు తక్షణమే అందజేయాలని సూచించారు.పేద ప్రజల సంక్షేమానికి సంబంధించిన పథకాలను ఏది ఆపిన ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం యూత్ ప్రెసిడెంట్ రంజిత్ కుమార్,ఆశ్వాపురం ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు చల్లా రాజేష్,ఆశ్వాపురం యూత్ వైస్ ప్రెసిడెంట్ రాసాల రమేష్, గొల్లగూడెం సర్పంచ్ కొండ్రు సమ్మయ్య,బీసీ సెల్ అధ్యక్షులు అరసవెల్లి పవన్ యువజన నాయకులు మంగళగిరి రామకృష్ణ,జావిద్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram