ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యం

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం /ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన కరకగూడెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై పీవీ నాగేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిరుమళ్ళ గ్రామానికి చెందిన చంద్ర శంకర్రావు (50) ఈ నెల 17 తేదీన ఉదయం ఎనిమిది గంటలకు బయ్యారం వెళ్లి వస్తానని బయలుదేరాడు. ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు.అతని భార్య చందా విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు. పైన తెలిపిన వ్యక్తి ఎవరికైనా కనిపించినట్లయితే కింది నెంబర్ కు సమాచారం ఇవ్వగలరు ..

 Cell 8712682103

 

Facebook
WhatsApp
Twitter
Telegram