విశాఖ లో ప్రైవేట్ స్కూల్ లో టీచర్ మందలించడంతో ఆరేళ్ల బాలుడి మృతి..
గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్/ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహిళా టీచర్‌కు భయపడిన ఓ విద్యార్థి తుదిశ్వాస వీడిచాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశాఖలోని లిటిల్ గార్డెన్ స్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉపాధ్యాయురాలు బాలుడు యూనిఫామ్‌ను సరిచేస్తుండగా, బాలుడు ఏవడం మొదలుపెట్టాడు. దీంతో ఆ బాలుడుని టీచర్ చెంబదెబ్బ కొట్టింది. ఆ వెంటనే ఆ బాలుడు ఉపాధ్యాయురాలిపైనే కుప్పకూలిపోయాడు. మృతుడిని ప్రణయ్ తేజ్ (6)గా గుర్తించారు.
ఆ తర్వాత బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. సీసీటీవీ దృశ్యాలను చూసిన తర్వాత, శారీరక శిక్ష వల్లే బాలుడు మరణించాడని ఆరోపిస్తూ అతని తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలుడిని కొట్టిన ఉపాధ్యాయురాలు, పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.









