మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి: ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు

 

గోల్డెన్ న్యూస్ / మెదక్/ మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని పలు విభాగాలను పరిశీలించి, కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలని ఎస్పీ సూచించారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించి, చట్టపరమైన చర్యలను వేగంగా చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా దర్యాప్తు సమయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతో పాటు, అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలను సమగ్రంగా పరిశీలించాలని తెలిపారు.

 

అనంతరం పోలీస్ స్టేషన్లోని రికార్డులు, కేసు డైరీలు, ఇతర ముఖ్యమైన పత్రాలను పరిశీలించి, వాటి నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించి, వారి సమస్యలను సానుకూలంగా విని పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.

 

పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram