చిరుత పులి చర్మం, గోర్లు విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్టు

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిరుతపులి చర్మం గోర్లను విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను బూర్గంపహాడ్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు, బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ E. నాగ బిక్షం, టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో తేది:24 తేదీ ఉదయం సమయంలో తాళ్లగొమ్మూరు గ్రామంలోని అనిల్ అనే వ్యక్తీ ఇంటి వద్ద, అనుమానాస్పదంగా ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

 

అయితే నిందితులు గత సంవత్సరం వేసవి కాలంలో చింతూరు మండలం గమ్మలకోట గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో గుంతలో పడిపోయి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్న చిరుతపులిని రాళ్లు, కర్రలుతో, భాణాలు విసిరి చంపినట్లు అంగీకరించారు. అనంతరం దాని చర్మం, గోర్లను తొలగించి, చర్మాన్ని ఎండబెట్టి, గోర్లను భద్రపరిచి ఉంచినట్లు వెల్లడించారు. తరువాత చిరుతపులి చర్మం మరియు గోర్లను విక్రయించి డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తుండగా సారపాకకు చెందిన చల్లా అనిల్ కుమార్ అనే వ్యక్తీ భూమిని కౌలుకు తీసుకునే వ్యవసాయం చేసేందుకు  గమ్మలకోట గ్రామం,చింతూరు మండలం కు చెందిన కుంజా భద్రయ్య వద్దకు రాగా అతనిని సంప్రదించినట్లు తెలిపారు.

 

అనిల్ కుమార్ కొనుగోలుదారులను సంప్రదించి విక్రయానికి సహకరిస్తానని చెప్పడంతో, కుంజ భద్రయ్య, కుంజా గంగరాజు మరియు మడవి కన్నయ్య ముగ్గురు కలిసి చిరుతపులి చర్మం మరియు గోర్లను ఒక చిన్న బ్యాగ్‌లో పెట్టుకుని తాళ్లగొమ్మూరులోని అనిల్ కుమార్ ఇంటికి తీసుకువచ్చారు.ఈ క్రమంలో చిరుతపులి చర్మాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.నిందితుల వద్ద నుంచి చిరుతపులి చర్మం మరియు (17) గోర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ వివరాలను వెల్లడించారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram