తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

రాముడు నడయాడిన భద్రాద్రి నేలపై న్యాయం కోసం ఆడబిడ్డ ఆవేదన.

తల్లి దండ్రుల కుటుంబ వివాదంలో తనను దూరం చేశారంటూ కూతురి ఆవేదన.

భద్రాచలంలో చర్చనీయాంశంగా మారిన మహిళ నిరస

 

భద్రాచలం : తండ్రి ప్రేమ, ఆప్యాయత కోసం ఓ కూతురు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఘటన భద్రాచలంలో చర్చనీయాంశంగా మారింది. తండ్రి మాట కోసం రాజ్యాన్నే వదులుకున్న శ్రీరాముడు నడయాడిన భద్రాద్రి నేలపై, తన తండ్రి ప్రేమ కోసం ఓ ఆడబిడ్డ న్యాయం కోరుతూ దీక్షకు కూర్చోవడం పలువురిని కలచివేస్తోంది.

 

దీక్షకు కూర్చున్న మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబంలో కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాల కారణంగా తనను తండ్రి దూరం చేశారని ఆరోపించింది. తన తల్లితో సంబంధాలు కొనసాగిస్తున్నారనే కారణంతో తండ్రి తనను దగ్గరకు రానివ్వడం లేదని, తల్లితో మాట్లాడి విడాకులు తీసుకుంటేనే తనను అంగీకరిస్తానని చెబుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

 

భర్తపై తీవ్ర ఆరోపణలు

 

తన తల్లి దాంపత్య జీవితంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొందని కూతురు ఆరోపించింది. భర్త తన తల్లిని మానసికంగా వేధించడంతో పాటు, ఆమెను ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో చేర్పించారని తెలిపింది. అయితే తనకు ఎలాంటి మానసిక సమస్య లేదని నిరూపించుకుని ఆస్పత్రి నుంచి బయటకు వచ్చినట్లు పేర్కొంది.

 

కొన్నేళ్లుగా తన తల్లిని భర్త, కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆమె ఆరోపించింది. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడకుండా దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.

 

న్యాయం కోసం దీక్ష

 

తమ సమస్యను పలువురి దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని బాధితురాలు వాపోయింది. ప్రభావశీల వ్యక్తుల అండదండలు ఉండటంతో ఎక్కడికి వెళ్లినా తమకు న్యాయం దక్కడం లేదని ఆరోపిస్తూ చివరకు ఆమరణ నిరాహార దీక్షకు దిగినట్లు తెలిపింది.

 

తండ్రి ప్రేమ కోసం కూతురు రోడ్డుపై దీక్షకు కూర్చోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని స్థానికులు పేర్కొంటున్నారు.

ఈ కుటుంబం వివాదంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఇరువర్గాల వాదనలు పూర్తిస్థాయిలో తెలుసుకొని వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram