రేగాకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ

ఏం సాధించారని ఈ ర్యాలీలు..

ప్రజల ముందుకు రాలేకపోయిన మాజీ ఎమ్మెల్యే.. సీఎం గురించి మాట్లాడే స్థాయి మీది కాదు.

 సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.

 

కరకగూడెం :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు  పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు రాష్ట్ర ముఖ్యమంత్రిని  రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ తీవ్రంగా ఖండించారు.

 

అనంతరం వారు మాట్లాడుతూ..

ఏం సాధించారని ఈ ర్యాలీలు? సుమారు నెల రోజులుగా ప్రజల ముందుకు ఎందుకు రాలేదు? ఆరోపణలు వచ్చిన నాటి నుంచి ప్రజలకు సమాధానం చెప్పకుండా ఇప్పుడు బయటకొచ్చి నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అని అన్నారు.

 

ఒక మహిళ చేసిన ఆరోపణలు ఏమిటి? మీ ఇద్దరి మధ్య లావాదేవీలకు సంబంధించిన ఆరోపణలు నిజం కాదా? ఆ మహిళ ఫిర్యాదు మేరకు  కేసు నమోదైనట్లు చెబుతున్న నేపథ్యంలో, ఈ అంశాలపై ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మీపై లేదా?” అని సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ప్రశ్నించారు.

 

నిప్పు లేనిదే పొగ రాదు’ అన్నట్లు.. ఆరోపణలు వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ప్రజలకు దూరంగా ఉండటానికి కారణం ఏమిటి? తప్పు లేదని చెబుతున్నప్పుడు ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత లేదా?” అని ప్రశ్నించారు.

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక స్థాయి రేగా కాంతారావుకు లేదు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అని అన్నారు.

 

పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నాయకత్వంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించే ముందు గతంలో మీరు ప్రజలకు ఏం చేశారో చెప్పాలి అని అన్నారు.

 

సుమారు నెల రోజులుగా ప్రజలకు దూరంగా ఉండి, ఇప్పుడు ర్యాలీలు నిర్వహించి ఏదో గొప్ప పోరాటం చేసినట్లు మాట్లాడటం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. నిజంగా ప్రజల కోసం పోరాడే నాయకుడైతే ప్రజల ముందుకు వచ్చి ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది అని అన్నారు.

 

ఒకప్పుడు బడిపంతులుగా ఉన్న మీరు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ మీకు రాజకీయంగా అవకాశం ఇచ్చి ప్రజల ముందుకు తీసుకువచ్చింది. అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి అధికార బీఆర్‌ఎస్‌లో చేరిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు. ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రులను, మా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ని విమర్శించడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు.

 

రాజకీయ జీవితంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మీ ఆస్తులు, వాటి పెరుగుదల, వాటికి సంబంధించిన ఆదాయ వనరులపై ప్రజల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మీ రాజకీయ ప్రస్థానంలో సంపాదించిన ఆస్తులకు ఆదాయ వనరులు ఏమిటో ప్రజలకు స్పష్టంగా చెప్పగలరా? ప్రజలకు జవాబు చెప్పాల్సింది పోయి ఇతరులపై ఆరోపణలు చేయడం ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు.

 

కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయంగా ఎదిగి, కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి ప్రజల మద్దతు పొందిన మీరు.. అదే కాంగ్రెస్ పార్టీ గురించి, మా నాయకుల గురించి మాట్లాడే ముందు మీ రాజకీయ గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ మీకు రాజకీయ వేదిక కల్పించిన విషయాన్ని మర్చిపోవద్దు” అని మరొకసారి గుర్తు చేశారు..

 

తప్పుడు కేసులు పెట్టించేంత తప్పుడు మనుషులు మా నాయకులు కాదు. మా నాయకులపై, కాంగ్రెస్ పార్టీపై నిరాధార ఆరోపణలు చేస్తే ఖబడ్దార్ రేగా కాంతారావు.. చూస్తూ ఊరుకోం. ప్రతి ఆరోపణకు రాజకీయంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టిగా సమాధానం చెబుతాం అని హెచ్చరించారు.

 

రాజకీయ విమర్శలకు మేము భయపడేది లేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి పై గానీ, మంత్రులపై గానీ, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పై గానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులపై గానీ వ్యక్తిగతంగా అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు అని స్పష్టం చేశారు.

 

చివరగా రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని చూస్తున్నారు.. మాటల రాజకీయాలను కాదు. ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారో, ఎవరు కేవలం రాజకీయ ఆరోపణలతో కాలం గడుపుతున్నారో ప్రజలకు స్పష్టంగా తెలుసు. ర్యాలీలు, వ్యక్తిగత విమర్శలతో ప్రజల తీర్పును మార్చలేరు అని సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అన్నారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ – గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram