కాంగ్రెస్ నాయకులు హద్దు దాటి మాట్లాడితే తాటతీస్తాం

మా నాయకున్ని విమర్శిస్తే సహించేది లేదు

ప్రజల కోసం నిరంతరం కృషి చేసే రేగా

ప్రజాసమస్యలు గాలి వదిలివేసి ఆరోపణలు చేయడమే కాంగ్రెస్ నాయకులు పని

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి

 

కరకగూడెం : టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేఖరల సమావేశంలో ఏర్పాటుచేసి వారు మాట్లాడుతూ. మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును విమర్శిస్తూ కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మా నాయకుడు రేగాపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకుని,ప్రజలకు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ నాయకులు ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రేగా కాంతారావుకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ కాదు.. ప్రజలే రాజకీయంగా ఆదరించి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ప్రజల తీర్పును ఏ పార్టీ నాయకుడూ తన ఖాతాలో వేసుకోవద్దు” అని బీఆర్ఎస్ నాయకులు ఘాటుగా వ్యాఖ్యానించారు.

రేగా కాంతారావును విమర్శించే ముందు కాంగ్రెస్ నాయకులు తమ ప్రభుత్వ పనితీరును ఒక్కసారి అద్దంలో చూసుకోవాలని అన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారు? నియోజకవర్గానికి ఎన్ని కొత్త అభివృద్ధి పనులు తీసుకొచ్చారు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.

రేగా కాంతారావుపై వచ్చిన ఆరోపణలు, కేసుల అంశాన్ని రాజకీయంగా ప్రస్తావించడంపై బీఆర్ఎస్ నాయకులు స్పందిస్తూ..“రేగా కాంతారావుపై నమోదైన కేసును సంబంధిత న్యాయస్థానం ఇప్పటికే కొట్టివేసింది.కోర్టు తీర్పుతో ముగిసిన అంశాన్ని మళ్లీ మళ్లీ రాజకీయ విమర్శలకు ఉపయోగించడం సరికాదు. కోర్టు తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది” అని అన్నారు.

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేయడం మీ చేతకానితనానికి నిదర్శనమని,చట్టపరంగా ముగిసిన అంశాలను పట్టుకుని రాజకీయ ప్రత్యర్థిని బలహీనపర్చాలని చూడటం ప్రజలు గమనిస్తున్నారు”అని పేర్కొన్నారు.

రేగా కాంతారావుపై వచ్చిన ఆరోపణలను పదేపదే ప్రస్తావిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారని, కానీ ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు అన్నారు.

కోర్టు కొట్టివేసిన కేసును కూడా రాజకీయ ప్రచారంలోకి తీసుకురావడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించలేరు” అని స్పష్టం చేశారు.

ముందు రేగా కాంతారావు ఆస్తుల గురించి ప్రశ్నించే నైతిక హక్కు మీకుందా? మీ పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధుల ఆస్తుల వివరాలను కూడా ప్రజల ముందు పెట్టండి.అప్పుడు ఎవరు ఎవరిని ప్రశ్నించాలో ప్రజలే నిర్ణయిస్తారు” అని సవాల్ విసిరారు.

రేగా కాంతారావు మాజీ ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజల మధ్యే ఉన్నారని, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తున్నారని పేర్కొన్నారు.కాంగ్రెస్ నాయకులు మాత్రం ప్రజా సమస్యలపై సమాధానం చెప్పకుండా రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడానికే సమావేశాలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు.

రేగా కాంతారావును విమర్శించే స్థాయి మీకుందా? ప్రజల్లో ఎవరి బలం ఎంత ఉందో ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది.సమావేశాల్లో కూర్చొని మైకులు పట్టుకుని విమర్శలు చేస్తే ప్రజల అభిప్రాయం మారదు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల హక్కు అని,ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై చర్చకు సిద్ధమైతే బీఆర్ఎస్ కూడా బహిరంగ వేదికపై చర్చకు సిద్ధంగా ఉందని సవాల్ చేశారు.

ర్యాలీలు ఎందుకు చేస్తున్నారని అడిగే ముందు,ప్రజలు ఎందుకు రోడ్డెక్కాల్సి వస్తుందో తెలుసుకోండి.ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తే మరింత గట్టిగా ప్రజల మధ్యకు వెళ్తాం”అని హెచ్చరించారు.

చివరగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. వ్యక్తిగత దూషణలు, బెదిరింపు వ్యాఖ్యలతో రాజకీయాలు నడవవు. ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలు.రేగా కాంతారావుపై ఒక్క మాట మాట్లాడితే తాట తీస్తామని హెచ్చరించారు.కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై వంద ప్రశ్నలు కూడా అడుగుతాం.కోర్టు కొట్టివేసిన కేసును మళ్లీ రాజకీయ ప్రచారానికి ఉపయోగించకుండా,ప్రజా సమస్యలపై చర్చకు సిద్ధమైతే బహిరంగ వేదికపైకి రండి” అని సవాల్ విసిరారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య,సర్పంచులు కొమరం సత్యనారాయణ,వట్ట సందీప్,బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు పోగు వెంకటేశ్వర్లు,బైరిశెట్టి చిరంజీవి,రేగా సత్యనారాయణ,అత్తె సత్యనారాయణ,నిట్టా ఏడుకొండలు,యల్లు రామకృష్ణారెడ్డి,కటకం లెనిల్,జాడి నాగరాజు,కొమరం విశ్వనాథం,పాయం క్రిష్ణ,పాయం నర్సింహారావు, కటకం లెలిన్,పాయం కృష్ణ,గాందర్ల సతీష్, ప్రశాంత్,రాంబాబు,శ్రీను, యాకూబ్ పాషా,వేణు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram