సెప్టెంబర్ 7న ఏటూరునాగారంలో ఆదివాసీ మార్చ్

సెప్టెంబర్ 7న ఏటూరునాగారంలో ఆదివాసీ మార్చ్               — వేలాదిగా తరలిరావాలి

 

  కొమురం భీమ్ విగ్రహం వద్ద ‘ఆదివాసీ మార్చ్’ పోస్టర్ ఆవిష్కరణ

 

కరకగూడెం :  మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల సాక్షిగా ప్రారంభమైన ఆదివాసీ హక్కుల పోరాటాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న “ఆదివాసీ మార్చ్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తుడుందెబ్బ నాయకులు పిలుపునిచ్చారు.

 

బుధవారం కరకగూడెం మండలంలోని భట్టుపల్లి గ్రామంలో గల కొమురం భీమ్ విగ్రహం వద్ద తుడుందెబ్బ మండల అధ్యక్షులు కలం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో “ఆదివాసీ మార్చ్ పాస్ట్” పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డా. మైపతి అరుణ్ కుమార్, తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ హాజరై పోస్టర్‌ను ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీల హక్కులు, చట్టపరమైన రక్షణ, ఉద్యోగాలు, భూమి హక్కులు, సాగునీరు, ఉపాధి అవకాశాలు తదితర సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

 

ఆదివాసీ పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ఐటీడీఏ కేంద్రాల వద్ద భారీ “ఆదివాసీ మార్చ్” కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

 

📍 సెప్టెంబర్ 7 – ఏటూరునాగారం

📍 సెప్టెంబర్ 16 – ఉట్నూర్

📍 సెప్టెంబర్ 21 – భద్రాచలం

📍 సెప్టెంబర్ 28 – మన్ననూరు

 

ఈ కార్యక్రమాల్లో ఆదివాసీ ప్రజలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

 

ప్రధాన డిమాండ్లు

 

ఆదివాసీల రిజర్వేషన్ల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

 

5వ షెడ్యూల్ ప్రాంతాల్లో ఉద్యోగాల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలి.

 

ఐటీడీఏ పరిధిలోనే ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్లు, బదిలీలకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి.

 

ఏజెన్సీ ప్రాంత యువతకు ఉద్యోగాల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలి.

 

పోడు భూములకు హక్కు పత్రాలు అందించాలి.

 

గిరివికాస్ పథకం ద్వారా బోర్లు మంజూరు చేయాలి.

 

గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా ఆదివాసీ ప్రాంత రైతులకు సాగునీరు అందించాలి.

 

BTPS, KTPS, BPL, సింగరేణి తదితర సంస్థల్లో ఆదివాసీలకు ఉద్యోగ, వాటా అవకాశాలు కల్పించాలి.

 

నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టాలి.

 

 

డా. మైపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ఆదివాసీల సమస్యలపై ఎన్నిసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా ఆశించిన స్థాయిలో పరిష్కారం లభించలేదని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఐటీడీఏ కేంద్రాల వద్ద ఆదివాసీ మార్చ్‌లకు పిలుపునిచ్చామని తెలిపారు. ఆదివాసీల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

 

పోలేబోయిన వెంకటనారాయణ మాట్లాడుతూ, కరకగూడెం మండలం నుంచి ఆదివాసీ ప్రజలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో సెప్టెంబర్ 7న ఏటూరునాగారానికి తరలివచ్చి ఆదివాసీ మార్చ్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

 

కొమురం భీమ్ స్ఫూర్తితో — ఆదివాసీ హక్కుల సాధన కోసం ఐక్యంగా కదలండి.

ఏటూరునాగారానికి తరలి రండి ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డా. మైపతి అరుణ్ కుమార్, జాతీయ ఉపాధ్యక్షులు పోడెం బాబన్న, రాష్ట్ర కార్యదర్శి కోరగట్ల లక్ష్మణ్, ASU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోర్నిబెల్లి గణేష్, తుడుందెబ్బ జిల్లా కోశాధికారి సుతారి నాగేశ్వరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కలం వేణుగోపాల్, మండల ప్రధాన కార్యదర్శి తోలేం హరికృష్ణ,కోశాధికారి చందా గణేష్, ASU కోశాధికారి పోలేబోయిన స్వామి ప్రసాద్, పోలేబోయిన కార్తీక్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram