ములుగు: మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద రెండు గృహాలపై ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ప్లాంట్లను రాష్ట్ర మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్‌తో కలిసి ప్రారంభించారు.
ఒక్కో గృహంపై 2 కిలోవాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ప్లాంట్లను ప్రారంభించిన అనంతరం మంత్రి సీతక్క లబ్ధిదారులతో మాట్లాడారు.
అనంతరం ఉపాధి హామీ పథకం 2026–27 నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన శ్రీ సీతారాముల గ్రామ సమాఖ్య భవనాన్ని మంత్రి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్రజలకు మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతోందని అధికారులు తెలిపారు.

Post Views: 15








