తెలంగాణ ఎన్నికల ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: ఓటర్ల జాబితా అంశంపై నిరసనకు దిగిన సీపీఐ కార్యకర్తలు తెలంగాణ ఎన్నికల ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలు గేట్లు తోసుకుని కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఈటి నరసింహ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా నుంచి కోట్లాది మంది ప్రజల ఓట్లను తొలగిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు.

 

ఓటర్ల హక్కులను పరిరక్షించాలని, ఓటర్ల జాబితాలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ డిమాండ్ చేసింది.

 

ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశాలపై ప్రస్తుతం రాజకీయ వివాదం కొనసాగుతోంది. ఎన్నికల సంఘం మాత్రం కీలక నిర్ణయాలు పూర్తి కమిషన్‌ సమ్మతితోనే తీసుకున్నట్లు పేర్కొంది.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram