ముగిసిన నైరుతి రుతుపవనాల సీజన్.. 13 శాతం లోటు వర్షపాతం..

ముగిసిన నైరుతి రుతుపవనాల సీజన్.. 13 శాతం లోటు వర్షపాతం..

 

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌ ముగిసింది. ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.

 

భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం, సాధారణంగా 868.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా.. ఈసారి సుమారు 759.5 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. అంటే సాధారణ వర్షపాతంతో పోలిస్తే 12.6 శాతం లోటు నమోదైంది.

 

గత దశాబ్ద కాలంలో నైరుతి రుతుపవనాల సీజన్‌లో తక్కువ వర్షపాతం నమోదైన సీజన్ ఇదే. ఇక, 2001 తర్వాత నమోదైన తక్కువ వర్షపాతం ఉన్న రుతుపవన సీజన్లలో ఇది నాలుగో స్థానంలో ఉంది. ఈ ఏడాది రుతుపవనాలపై ఎల్‌నినో పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపించాయి. పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం ద్వారా ఏర్పడే ఎల్‌నినో సాధారణంగా భారత రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈసారి వర్షపాతం తగ్గడానికి ఇది ప్రధాన కారణాల్లో ఒకటిగా పేర్కొంటున్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram