ఆటో డ్రైవర్ బాలు కుటుంబానికి ఆర్థిక సహాయం

కరకగూడెం : మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మలకుర్తి బాలక్రిష్ణ(బాలు) ఇటీవల ఆనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో కరకగూడెం ఆటో యూనియన్ సభ్యులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ. 5,000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు కొమరం సాంబశివరావు,గుడ్ల రంజిత్ కుమార్,నిట్టా సౌందర్యరావు,బెజవాడ రాములు,బాదె సాగర్,కొలగాని రవి,యజ్జు సాయి,తోలెం రవి,బంధు సతీష్,నిట్టా సాయి,తోట శివ,నిట్టా సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram